ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 7:56 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

అన్ని జిల్లాల కలెక్టర్లతో తో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

అర్జున్ సమాచారం:
హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ భూసేకరణ, పరిహారం చెల్లింపు తదితర అంశాలపై రాష్ట్ర నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.నీటిపారుదల ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తయ్యేందుకు పెండింగ్ భూసేకరణను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పెండింగ్ భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.2,800 కోట్లు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టిందని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.
కొత్త ఆయకట్టు సృష్టించేందుకు వీలుగా పెండింగ్ భూసేకరణ, పునరావాస పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. భూసేకరణకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నందున ఎక్కడా జాప్యం లేకుండా ప్రక్రియను పూర్తి చేసి, ప్రాజెక్టుల పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ , పరిహారం చెల్లింపు, పునరావాసానికి సంబంధించిన ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పెండింగ్ భూసేకరణకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం నుండి జిల్లా కలెక్టర్ కె. హైమావతి, నీటి పారుదల శాఖ ఎస్ఈ, డిఈ తదితరులు పాల్గొన్నారు.
==============================